హైదరాబాద్‌పై చంద్రబాబు శాపాలు పెడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ తెరాస బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. కేశవరావు రాజ్యసభలో, ఎంపీలు లోక్‌సభలో మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంఐఎంతో కలుపుకుని కచ్చితంగా 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి గెలుస్తారని జోస్యం చెప్పారు. తెరాస, వైకాపా కలుపుకుని 35 లేదా 36 ఎంపీ స్థానాలు గెలుస్తామని అన్నారు గులాబీ బాస్. ఆంధ్ర ప్రజలతో తనకెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు.
వైకాపాతో కలిపి 36 సీట్లు గెలుస్తాం: కేసీఆర్ - KCR CAMPAIGN
కారు.. సారు... పదహారు.. కేసీఆర్ నినాదంతో ముందుకెళ్తున్న తెరాస... ప్రచార జోరుని పెంచింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు గులాబీ బాస్ హాజరయ్యారు. ఏపీలో వైకాపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెరాస, వైకాపా కలిపి 36 ఎంపీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కే. చంద్రశేఖర్ రావు
TAGGED:
KCR CAMPAIGN