రోజుకురోజుకూ భానుడి ప్రతాపం తీవ్రమవుతోంది. రాష్ట్రంలో మే నెలలో సగటున 41 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ వేడిమి తక్కువగా ఉన్న సమయాల్లోనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో గరిష్ఠంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఎన్నికల వేడి చల్లారింది. కానీ... భానుడి భగభగలు మాత్రం తగ్గలేదు. ఎండ వేడి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నేటి ఉష్ణోగ్రతల వివరాలు
గుంటూరు జిల్లా పెద్దకూరపాడు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో గరిష్ఠంగా 44.57 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 69 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
ఇవీ చదవండి...
ఈ విజయం ఊహించిందే: మోహన్‌బాబు