ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఎంత దూరమైనా పయనిస్తాం.. 'హామ్​'తో సమాచారమందిస్తాం! - ఫొని తుపాను

ఫొని తుపాను ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్​, సమాచార,తాగునీటి వ్యవస్థల్నీ ఛిన్నాభిన్నం చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు మానవతావాదులు... తమ వంతు సేవచేయడానికి భువనేశ్వర్​ వెళ్లారు. తుపాను పరిణామాల్ని.. సంబంధిత సమాచారాన్ని... సాంకేతికత ఆధారంగా వేరే ప్రాంతాలకు వేగంగా చేరవేశారు. హామ్​ అనే సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి.. ఉన్నతమైన సేవలు అందించారు.

.'హామ్​'తో సమాచారమందిస్తాం..!

By

Published : May 4, 2019, 6:36 PM IST

విపత్కర సమాయాల్లో అండగా..'హామ్​'..!

తెలుగు రాష్ట్రాలకు చెందిన కుటుంబాక రమేష్​, సురేష్​, రవితేజ అనే వ్యక్తులు... 1200 కిలోమీటర్ల పాటు ప్రయాణించారు. మార్గమధ్యంలో తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెను గాలుల నుంచి కాపాడుకునేందుకు.. 2 భారీ లారీల మధ్యలో తమ కారును నడుపుతూ.. చివరికి అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు. ప్రచండ తుపాను ప్రభావానికి సమాచార వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో.. హామ్ సాంకేతికతతో తమ వంతు సేవ చేశారు. ఇలా చేయడం తమకు సంతృప్తినిస్తోందని చెప్పారు. హామ్​ సమాచార వ్యవస్థ.. మిగతా వ్యవస్థల కన్నా మెరుగైన ఫలితాలనిస్తోందన్నారు.

అసలేంటీ.. ఈ హామ్​ కమ్యూనికేషన్స్​..!

హామ్​..ఓ కమ్యూనికేషన్​ పరికరం.. రేడియో సిగ్నల్స్​ ద్వారా ఇది పని చేస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ..అన్ని రకాల సమాచార వ్యవస్థల్లో లోపం తలెత్తినా.. ఈ సాంకేతిక వ్యవస్థతో స్పష్టంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. మిగతా సమాచార వ్యవస్థలకూ.. హామ్ కమ్యూనికేషన్​కూ ఇదే ప్రధానమైన తేడా. ఏ రిలే సిస్టమ్స్​ మీద హామ్​ ఆధారపడదు. ఎలాంటి టవర్స్, సర్వర్స్​ అవసరం లేదు. 1900వ దశకంలో మొదలైన వ్యవస్థ.. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉపయోగంలో ఉంది. ఈ విధానంలో సిగ్నల్స్​ ఐనో ఆవరణం నుంచి నేరుగా వేరే స్టేషన్​కు చేరుకుని సమాచారమందిస్తాయి. ప్రకృతి వైపరీత్య సమయాల్లో ఈ వ్యవస్థ మంచి ఫలితాలనిస్తుంది. పైగా.. ఎవరికీ పైసా రుసుము చెల్లించాల్సిన అవసరమూ లేదు.

ఇవీ చదవండి...ఫొనితో రైల్వేకు తీవ్ర నష్టం.. విమానయానంపైనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details