తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తిరుపతి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరిన కేసీఆర్‌కు.. వైకాపా నేతలు రెడ్డప్ప, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చింతల, ఆదిమూలం, నవాజ్ బాషా ఘన స్వాగతం పలికారు. కాసేపు.. వారితో ముచ్చటించారు. అనంతరం.. రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లారు.
తిరుమలకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఘన స్వాగతం - tirupati
తిరమల శ్రీవారి దర్శన నిమిత్తం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు.
kcr at renigunta
తిరుమలలోనూ కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. శ్రీకృష్ణ అతిధి గృహం వద్ద తితిదే ఈఓ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, పలువురు వైకాపా నాయకులు కేసీఆర్ ను స్వాగతించారు. రాత్రికి శ్రీకృష్ణ అతిథి గృహంలోనే ఆయన బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని కేసీఆర్ దర్శించుకుంటారు.
Last Updated : May 26, 2019, 6:42 PM IST