ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇందిరమ్మతోనే పోరాడి గెలిచిన పార్టీ తెదేపా: కళా - chandrababu letter

తెదేపా ఎప్పుడూ ప్రజలపక్షమని...సంక్షోభాలు ఎన్ని ఎదురైనా ఎదిరించి నిలిచిన చరిత్ర తెదేపాదని ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ అన్నారు. నలుగురు ఎంపీల పార్టీల మార్పు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

ఇందిరమ్మతోనే పోరాడి గెలిచిన పార్టీ తెలుగుదేశం : కళా వెంకట్రావ్

By

Published : Jun 23, 2019, 12:02 AM IST

ప్రతిపక్షనేత కార్యకలాపాలకు ప్రజావేదికను కేటాయించాలని మర్యాదపుర్వకంగా అడిగినా...ప్రభుత్వం కావాలనే వివాదం చేసిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ విజ్ఞతకే వదిలేశామని...తాము ఇక ప్రజావేదిక గురించి మాట్లాడమన్నారు. 1989 ఎన్నికల్లో తెదేపా నుంచి ఇద్దరే ఎంపీలు గెలిస్తే....1994లో తిరిగి ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని కళా అభిప్రాయపడ్డారు. నాయకులను తయారుచేసే ప్రజలపార్టీగా తెలుగుదేశం నిలుస్తుందని వెల్లడించారు. మోదీకి కన్నా ఎంతో సీనియర్​ అయిన ఇందిరమ్మతోనే పోరాడి గెలిచిన చరిత్ర తెదేపాకు ఉందన్నారు. క్యాడర్ ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదంటున్న కళా వెంకట్రావ్​తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

ఇందిరమ్మతోనే పోరాడి గెలిచిన పార్టీ తెలుగుదేశం : కళా వెంకట్రావ్

ABOUT THE AUTHOR

...view details