ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు అడిగినందుకే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని సీఎం పునరాలోచించాలని సూచించారు.
ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం పునఃసమీక్షంచాలి: తెదేపా - ప్రజావేదిక
అమరావతి ప్రజావేదిక అక్రమకట్టడమని దానిని కూల్చివేస్తామన్న సీఎం జగన్ నిర్ణయం పై తెదేపా నేతలు మండిపడ్డారు. ఇది కక్షసాధింపు చర్యేనని...కూల్చివేత నిర్ణయం సరికాదని...సీఎం పునరాలోచించుకోవాలని సూచించారు.
tdp reaction on praja vedika
ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావాల్సిన అనుమతులు అధికారులు ఇచ్చారని... అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వైఎస్ హయాంలోనే ఇదే కరకట్టపై అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజావేదిక నిర్మిస్తే కూల్చివేత నిర్ణయం సరికాదని అన్నారు.