'భవిష్యత్ కార్యాచరణ'పై.. తెదేపా నేతల భేటీ! - tdp leaders meeting
కాకినాడలో తెదేపా కీలక నేతలు సమావేశమయ్యారు. పార్టీ మారడంపైనే వారు భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపించినా... అలాంటిదేమీ లేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.
కాకినాడలోని ఓ హోటల్లో తెదేపా కీలక నేతల సమావేశం.. చర్చనీయాంశమైంది. సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా పార్టీ మారతారని, భాజపాలో చేరే విషయమై చర్చించారని ఊహాగానాలు వినిపించాయి. భేటీకి.. బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్‌రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడుతో పాటు.. మరికొందరు హాజరయ్యారని సమాచారం. ఈ భేటీని ధృవీకరిస్తూ.. తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ మారేది లేదనీ.. తెదేపాలోనే కొనసాగుతామనీ చెప్పారు. ఓటమికి కారణాలపైనే చర్చించామని అన్నారు.