నేను విన్నాను, నేను ఉన్నాననే జగన్ రైతు సమస్యలను ఏమి విన్నారు.. ఎక్కడున్నారు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విత్తనాలో జగన్ ప్రభూ అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు వలనే విత్తనాల కొరత ఏర్పడిందని చెప్పుతున్న వైకాపా నేతలు అధికారంలో ఉన్నామని మరిచిపోయారా అంటూ లోకేశ్ ట్విట్టర్లో విమర్శించారు. తెదేపా హయాంలో ఒకటో తేదీకల్లా పింఛను అందిస్తే... ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పదో తారీఖు వచ్చినా పింఛను కోసం ఇంకా ఎదురుచూపులే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం వల్లే పింఛన్ ఆలస్యమైందని సమాధానం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీమా లేనిదే..పేదల బతుకుల్లో ధీమా ఏదీ అని ప్రశ్నించారు.
ఏం విన్నారు... జగన్ ఎక్కడున్నారు : లోకేశ్ - లోకేశ్ ట్వీటర్
నెల రోజుల్లో జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెదేపా నేత లోకేశ్ అన్నారు. ఎన్నికల ముందు నేను విన్నా, నేను చూశా, నేను ఉన్నానన్న జగన్ ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు నెట్టే పనిలో పడ్డారని ట్వీటర్ వేదికగా విమర్శలు చేశారు.
ఏం విన్నారు...జగన్ ఎక్కడున్నారు : లోకేశ్
ఇదీ చదవండి :పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త