ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెదేపా వల్లే రాష్ట్రంలో మహిళల వికాసం: దివ్యవాణి

మండే ఎండల్లో వైకాపా నాయకులు కామెడీ షో చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు కనిపించకుండా పోయిన వైఎస్ షర్మిల.. మహిళాభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దివ్యవాణి

By

Published : Apr 1, 2019, 8:43 PM IST

దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి మహిళాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి చెప్పారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశానిదేనని గుర్తు చేశారు. లక్షలాది కుటుంబాలకు కట్టిస్తున్న ఇళ్లను.. మహిళల పేరుతోనే మంజూరు చేయిస్తున్నారని వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం 68 వేల 830 కోట్ల రూపాయలవడ్డీ లేని రుణాలిచ్చినట్లు చెప్పారు.లోకేశ్ గురించి మాట్లాడే అర్హత నేర చరిత్ర ఉన్న వైకాపాకు లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ కనిపించని షర్మిల.. ఇప్పుడు వైకాపా తరఫున ప్రచారం చేస్తూ మహిళాభివృద్ధి గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details