కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం దంపతులు - CM
సీఎం చంద్రబాబు.. ఉగాది సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలసి ముఖ్యమంత్రికి.. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబానికి ఆశీస్సులు అందించారు. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని సీఎం ఆకాంక్షించారు.
CM
ముఖ్యమంత్రి చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండగ చేసుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ తో కలిసి.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెదేపా ఎన్నికల ప్రణాళికను అమ్మవారి చెంత ఉంచి చంద్రబాబు పూజ చేయించారు. రాష్ట్ర ప్రజలంతా సిరిసంపదలతో.. సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు.