ఈ ఎన్నికల్లో గెలుపును రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తున్నారని కాకినాడ లోక్సభ తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్ఎస్ వర్మతో కలసి దుర్గాడ గ్రామంలో ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న చంద్రబాబుకు... పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నట్లు సునీల్ తెలిపారు. రాష్ట్రాన్ని పాలించగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నట్లు వర్మ అన్నారు. వైకాపాతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనంలేదన్నారు. నియోజకవర్గాల్లో అసమర్థులుగా తేలినవారే పార్టీని వీడుతున్నారని వెల్లడించారు.