రాష్ట్రంలో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 45.29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గుంటూరు జిల్లా దుర్గిలో 45.11, ప్రకాశం జిల్లా పొన్నలూరులో 44.77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 ప్రాంతాల్లో... 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 54 ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత - taza-summer
వేసవి తాపం రాష్ట్ర ప్రజలను భయపెట్టిస్తోంది. రోజు రోజుకీ ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. భానుడి భగభగలకు ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మరో వారం రోజులపాటు ఎండతీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
SUMMER
మరో వారం రోజులపాటు ఎండతీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.