వారం రోజులు భానుడి భగభగలే - taza-rtgs
వేసవి తాపం మరింత పెరగనుంది. ఈ వారం రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని పేర్కొంది.
![వారం రోజులు భానుడి భగభగలే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3286892-thumbnail-3x2-summer.jpg)
summer
రాష్ట్రంలో ఈ వారం మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం ఇచ్చింది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నాయని... అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలియజేసింది.