ఇన్నాళ్లూ రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు.. పండగ పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి సరదాగా గడిపారు. అలలతో ఆడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేరుకున్న ముస్లింలతో.. బీచ్ కళకళగా కనిపించింది. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. విపత్తు నిర్వహణ దళాలను సిద్ధంగా ఉంచారు. కట్టుదిట్టమైన భద్రత మోహరించారు.
సముద్రంలో జలకాలాట.. ముస్లింల రాకతో సూర్యలంక కిటకిట! - పర్యాటకులు
రంజాన్ మాసం పూర్తయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో సూర్యలంక బీచ్‌కు వచ్చారు. పర్యాటకుల తాకిడి దృష్ట్యా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు భద్రత పెంచారు.
పర్యాటకులతో కిటకిటలాడిన సూర్యలంక బీచ్