పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సురేష్‌రాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సేవా రంగాలకు అద్బుతమైన అడుగులుపడ్డాయని, 2020 నుంచి అవి మంచి ఫలితాలు ఇవ్వనున్నాయని పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సురేష్‌రాయుడు చిట్టూరి అన్నారు. అమలవుతున్న కార్యక్రమాలు సమర్దంగా కొనసాగితే... ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం పూర్తైతే... అమెరికాకు ఆర్దిక కేంద్రం కాలిఫోర్నియా తరహాలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అలా రూపాంతరం చెందనుందని సురేష్‌రాయుడు విశ్లేషించారు. ప్రభుత్వం మారుతుందేమోనన్న భయంతో గత ఏడాదిన్నరగా పెట్టుబడిదారులు కార్యకలాపాలు నిలిపివేశారని, ప్రభుత్వం కొనసాగితే... తొలి 3నెలల్లోనే వేల కోట్ల రూపాయల ప్రాజక్టులు ప్రారంభమవుతాయనిచెప్పారు. పారిశ్రమిక, సేవా రంగాల్లో 15 శాతం వృద్దిరేటుతో యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోన్న సురేష్‌రాయుడుతో ముఖాముఖి.