ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రేణిగుంట విమానాశ్రయంలో సూట్​కేసు కలకలం! - సూట్​కేసు కలకలం

రేణిగుంట విమానాశ్రయంలో ఓ సూట్​కేసు కలకలం సృష్టించింది.  విమానాశ్రయ పార్కింగ్​లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు సూట్​కేసు మరిచివెళ్లాడు.

రేణిగుంట విమానాశ్రయంలో సూట్​కేసు కలకలం!

By

Published : Jun 21, 2019, 9:51 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో సూట్​కేసు కలకలం!
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ సూట్ కేసు కలకలం రేపింది. విమానాశ్రయం కారు పార్కింగ్ వద్ద ఓ ప్రయాణికుడు సూట్ కేసు వదిలివెళ్లాడు. సుట్​కేసును గుర్తించిన సీఐఎస్​ఎఫ్​ భద్రతా బలగాలు డాగ్ స్క్వాడ్​కు సమాచారం అందించారు. అప్రమత్తమైన డాగ్ స్క్వాడ్ సిబ్బంది సూట్​కేసును తనిఖీ చేసి ఏమిలేదని నిర్థారించింది. ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన కల్యాణ్ అనే ప్రయాణికుడు సూటుకేసును మరిచిపోయినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. సూటుకేసును విమానాశ్రయ అధికారులు ఏర్పేడు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details