ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. నెల్లూరులో స్థానిక జూనియర్ కళాశాల వద్ద నుంచి పంచాయతీ బస్టాండ్ కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే.... మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిలిపివేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ డివిజన్ మాజీ కార్యదర్శి వెంకటయ్య అన్నారు.
'మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి' - nellore
మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జూనియర్ కళాశాల నుంచి పంచాయతీ మీదుగా బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని విద్యార్థుల ర్యాలీ