ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మంగళగిరిలో రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు - మంగళగిరి

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు గుంటూరు జిల్లా మంగళగిరి వేదికైంది. రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు.

మంగళగిరిలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలు

By

Published : Jun 3, 2019, 11:29 PM IST

మంగళగిరిలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీలు

రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగాయి. స్వ్కాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. జూనియర్స్‌, సీనియర్స్ విభాగాలలో మొత్తం 350 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 53 కిలోల విభాగంలో విశాఖకు చెందిన పవన్‌ సత్యకుమార్‌ ప్రథమ స్థానంలో గెలుచుకోగా, కడపకు చెందిన నరేంద్ర, మురళీకృష్ణ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 59 కిలోల విభాగంలో విశాఖకు చెందిన యశ్వంత్‌, ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌లు, ప్రథమ, ద్వితీయ నిలవగా, గుంటూరుకు చెందిన పి.భరత్​కుమార్‌ తృతీయస్థానాన్ని దక్కించుకున్నారు.

66 కేజీల విభాగంలో విశాఖకు చెందిన ప్రసాద్‌ ప్రథమ స్థానం, ప్రకాశం జిల్లాకు చెందిన చిరంజీవిరెడ్డి ద్వితీయ స్థానం గుంటూరు జిల్లాకు చెందిన అశోక్‌కుమార్‌ తృతీయ స్థానంలో నిలిచారు. 74 కేజీల విభాగంలో విశాఖకు చెందిన కె.సాయిచంద్‌, బి.అనిల్‌కుమార్‌, ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలవగా, గుంటూరు జిల్లాకు చెందిన పవన్‌కుమార్‌ మూడో స్థానంలో నిలిచారు. 59 కిలోల సీనియర్‌ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన సతీష్‌కుమార్‌, కె.యశ్వంత్‌, ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోగా, విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌. ప్రశాంత్‌కుమార్‌ తృతీయ స్థానంలో నిలిచారు.

74 కేజీల విభాగంలో విశాఖకు చెందిన సాయిచరణ్‌ ప్రథమస్థానాన్ని దక్కించుకోగా గుంటూరు జిల్లాకు చెందిన పవన్‌కుమార్‌, రాకేశ్వర్​లు ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రభాకర్‌, కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణలు విజేతలకు బహుమతులు అందించారు.

ఇవీ చూడండి :పోలవరం నిర్మాణ పనుల్లో రాజీ ధోరణి వద్దు:సీఎం

ABOUT THE AUTHOR

...view details