ప్రమాదాలకు అడ్డాగా మారుతోన్న శ్రీశైలం ఘాట్ రోడ్డు - ఘాట్ రోడ్డు
శ్రీశైలం మల్లన్నస్వామి దైవస్థానానికి వెళ్లే భక్తులకు, శ్రీ శైలం ప్రాజెక్టు, నల్లమల అటవీ అందాల వీక్షణ వచ్చే పర్యాటకులకు, దోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డే ఆధారం. నిత్యం రద్దీగా ఉండే ఈ ఘాట్ రోడ్డులో ప్రమాదాలు పరిపాటైపోయాయి. ప్రయాణం ప్రమాదం మారుతున్న ఈ రోడ్డు నిర్మాణ లోపాలను సవరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఈ ఘాట్ రోడ్డుకు ఒకవైపు లోయ, మరో వైపు కొండ ప్రాంతం ఉంటుంది. లోయ వైపున రక్షణగోడ నిర్మించారు. అయితే ఈ గోడ శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని చోట్ల ఎత్తు తక్కువుగా ఉండటం వల్ల వాహనం అదుపు తప్పినా అడ్డుకునే సామర్థ్యం లేకుండా పోతుంది. రేడియం స్టిక్కర్ల స్థంభాలు చాలా చోట్ల విరిగిపోయి పడి ఉన్నాయి. కొండ వైపు రక్షణ చర్యలు లేవు. వర్షాలు కురిస్తే కొండ చెరియలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు రక్షణ చర్యలు, రోడ్డు విస్తరణ చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.