అనంతపురం జిల్లా రాయదుర్గం శ్రీ ప్రసన్నవెంకటేశ్వరుని కల్యాణం..వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఉత్సవంలో అరవ వంశానికి చెందిన పద్మశాలీయైన బాలికతో స్వామి వారికి వివాహాం జరిపిస్తారు. మూడు వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందంటే ఆశ్యర్యం కలుగక మానదు.
9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం
అనంతపురం రాయదుర్గంలో జరిగిన.. శ్రీప్రసన్న వెంకటేశ్వరుని కల్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో అరవ వంశానికి చెందిన పద్మశాలీయైన బాలికతో స్వామి వారికి వివాహాం జరిపిస్తారు. 300 ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోందంటే..ఆశ్చర్యం కలుగక మానదు. అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గానికి చెందిన 9 ఏళ్ల అమ్మాయితో వెంకటేశ్వరునితో కల్యాణం జరిపించారు.
9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం
అందులో భాగంగానే రాయదుర్గం వాసి శివప్ప కుమార్తె అయిన లలిత కళా అనే 9 ఏళ్ల అమ్మాయితో వెంకటేశ్వరుని కల్యాణం జరిపించారు. ఇలా చేస్తే..ఆ బాలిక భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ నుంచే గాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై.. ఈ కార్యక్రమాన్ని తిలకించారు.
ఇవీ చదవండి...తిరుమాఢవీధుల్లో గురుడవాహనంపై విహరించిన శ్రీవారు
Last Updated : May 21, 2019, 9:41 AM IST