తితిదే పాలకమండలిలో నూతన ప్రభుత్వం శ్రీవారి భక్తులనే నియమించాలని ఆధ్యాత్మికవేత్త, గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దైవబలం చేకూరేలా ఏడు గంటల పాటు శ్రీవేంకటేశ్వర నామాన్ని శ్రీవారి ఆలయం ఎదురుగా జపించనున్నట్లు తెలిపారు. వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ధర్మకర్తల మండలిలో శ్రీవారి భక్తులు ఉండేలా చూడాలని సీఎంను కోరారు.
'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి' - kondaveeti jyothirmayi
ఏడు గంటల పాటు శ్రీవేంకటేశ్వర నామాన్ని జపించనున్నట్లు గాయని కొండవీటి జ్యోతిర్మయి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దైవబలం చేకూరేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడించారు. తితిదే పాలకమండలిలో శ్రీవారి భక్తులనే నియమించాలని ప్రభుత్వానికి విన్నవించారు.
'శ్రీవారి భక్తులనే తితిదే పాలకమండలిలోకి తీసుకోండి'