కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికవిడుదల చేసింది. దేశ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నో వేదికల మీద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు అదే విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచారు. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రాజ్యసభలో ఇచ్చిన ఆ హామీని నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో.. ఏపీకి ప్రత్యేక హోదా - కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నో వేదికల మీద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. మేనిఫెస్టోలనూ ఈ విషయాన్ని పొందుపరిచామన్నారు.
రాహుల్ గాంధీ