ఘనంగా ఖాద్రీ ఉరుసు గంధ మహోత్సవం... - special event
పెద్దకొత్తపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ కరీముల్లాషా ఖాద్రీ ఉరుసు గంధలమహోత్సవం సందర్భంగా అర్ధరాత్రి దర్గా నుంచి గ్రామంలోని పురవీధుల్లో అశ్వంపై ఊరేగుతూ ప్రజలకు గంధాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హజరయ్యారు.
ఉరుసు గంధ మహోత్సవం..
By
Published : Apr 4, 2019, 9:09 AM IST
ఉరుసు గంధ మహోత్సవం..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని పెద్ద కొత్తపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ కరీముల్లాషా ఖాద్రి ఉరుసు గంధ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్గాకు తరలివచ్చారు. పీఠాధిపతులు ఫాతిహా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అలరించాయి...నిర్వాహకులు అన్న సమారధన కార్యక్రమం నిర్వహించారు