సత్తెనపల్లిలో పర్యటించిన కోడెల - kodela
సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. మౌలిక వసతుల విషయంలో ఈ ప్రాంతం గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిందని గుర్తుచేశారు.
సత్తెనపల్లిలో పర్యటించిన కోడెల
రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా..చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని కోడెల శివప్రసాదరావు అన్నారు. అమరావతిని ప్రపంచపటంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నేతలతో సమస్యలపై చర్చించారు. తెదేపా విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. మౌలికవసతులు అంశంలో ఈ ప్రాంతానికి గిన్నిస్ బుక్లో స్థానం దక్కిందని వివరించారు.