ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చంద్రమోహన్, అబిద్ సూర్తిలకు ఎస్.పి బాలు అవార్డులు - ఎస్.పి బాలు

విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఎస్.పి బాలసుబ్రమణ్యం పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది అవార్డులను సినీనటుడు ఎం. చంద్రమోహన్, సమాజసేవకుడు అబిద్ సూర్తికి...వచ్చే నెల 4న ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఎస్​.పి బాలు సమీక్షా సమావేశం నిర్వహించారు.

గాయకుడు ఎస్​.పి బాలసుబ్రమణ్యం

By

Published : May 28, 2019, 5:09 PM IST

గాయకుడు ఎస్​.పి బాలసుబ్రమణ్యం మీడియా సమావేశం
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్​.పి. బాలసుబ్రమణ్యం పుట్టిన రోజును(జూన్ 4) పురష్కరించుకుని నెల్లూరులో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎస్.పి బాలసుబ్రమణ్యం పేరిట సినీరంగం, సమాజసేవ విభాగాల్లో సేవచేసే వారికి...అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది ఎస్.పి బాలు పేరిట రెండు అవార్డులు ఇవ్వాలని విజేత ఆర్ట్స్ నిర్ణయించింది.

గత అయిదు దశాబ్దాలుగా తెలుగు సినీ రంగంలో అనేక పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఎం.చంద్రమోహన్, నీటి విలువను నేటి సమాజానికి తెలియజేస్తోన్న సమాజసేవకుడు, చిత్రకారుడు, డ్రాప్ డెడ్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అబిద్ సూర్తికి ఈ అవార్డులు బహూకరించనున్నారు. విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో జూన్ 4న సాయంత్రం 6.30 గంటలకు నెల్లూరు నగరంలో జరిగే కార్యక్రమ ఏర్పాట్లపై ఎస్.పి బాలసుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details