టీవీ 9 యాజమాన్య వైఖరి నిరసిస్తూ సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు... బోర్డు సమావేశానికి ముందే రవిప్రకాశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏబీసీఎల్లో 90శాతం వాటా కలిగిన అలంద మీడియా చేసిన ఫిర్యాదుపై... సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి... గురువారమే దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు రవిప్రకాశ్, డైరెక్టర్ మూర్తి, కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్, సినీనటుడు శివాజీలకు... నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు డైరెక్టర్ మూర్తి, కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్.. సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
సీఈవో పదవికి రవిప్రకాశ్ రాజీనామా - undefined
టీవీ9 సీఈవో పదవికి రవిప్రకాశ్ రాజీనామా చేశారు. యాజమాన్య బోర్డు వైఖరి నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలంద మీడియా చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది.
![సీఈవో పదవికి రవిప్రకాశ్ రాజీనామా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3245305-729-3245305-1557499441072.jpg)
కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఇరువురి నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. టీవీ9 కార్యాలయంలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, లాప్‌టాప్‌లు, బయోమెట్రిక్ మిషన్లు, కీలక పత్రాలను విశ్లేషించడానికి... ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నట్లు తెలుస్తోంది. రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఎన్సీఎల్టీకి లేఖలు రాసిన పోలీసులు... కంపెనీ షేర్లకు సంబంధించిన వివరాలు, యాజమాన్య బదిలీ వివరాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఇదీ చూడండి: టీవీ9 నూతన సీఈవోగా మహేంద్ర మిశ్రా
TAGGED:
tv9 ceo ravi prakash resign