'సీఈవో పదవి నుంచి నన్ను తొలగించలేదు' - టీవీ 9
టీవీ9 సీఈవో పదవి నుంచి తనను తొలగించారన్న ప్రకటనను రవిప్రకాశ్ ఖండించారు. టీవీ9 ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడారు.
టీవీ 9సీఈవో పదవి నుంచి తనను తొలగించారన్న ప్రకటనను రవిప్రకాశ్ ఖండించారు.ఉదయం నుంచి జరిగిన పరిణామాల మధ్య సాయంత్రం టీవీ9లో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడిన రవిప్రకాశ్...టీవీ9సీఈవోగా ప్రేక్షకుల ముందుకు వచ్చానని చెప్పారు.తనను తప్పించినట్లు వచ్చిన ప్రకటనను ఖండించారు.తనను అరెస్టుచేస్తారన్న మాటలో నిజం లేదని,ఎవరూ అరెస్టు చేయబోరని చెప్పారు.ఈ ఉదయం నుంచి ప్రసారమైన వార్తల్లో నిజం లేదన్నారు.విలువైన జర్నలిజం కోసం తాను పని చేస్తున్నట్లు,అదే విలువలతో ఇకముందు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.