తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మార్చి 17న కరీంనగర్లో సభలో గులాబీ అధినేత... మతపరమైన వ్యాఖ్యాలు చేశారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం... శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది.
మతపరమైన వ్యాఖ్యలపై కేసీఆర్కు ఈసీ నోటీసు - notices
కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుతో.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
kcr