సీబీఐ వివాదంలోకి నాగేశ్వరరావు సతీమణి - సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ, పశ్చిమ్ బంగా పోలీసుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. సీబీఐ పూర్వ తాత్కాలిక సంచాలకుడు నాగేశ్వర రావు సతీమణికి చెందిన సంస్థలపై కోల్కతా పోలీసుల దాడులే ఇందుకు నిదర్శనం.
సీబీఐ-బంగాల్ వివాదంలో మరో మలుపుకేంద్ర దర్యాప్తు సంస్థకు ప్రస్తుత అదనపు సంచాలకుడు అడిషనల్ డైరెక్టర్, మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర రావు సతీమణి మన్నెం సంధ్యకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో... రెండు ఆర్థిక సంస్థలపై కోల్కతా పోలీసులు దాడులు చేశారు. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ను సీబీఐ ప్రశ్నించే ఒక రోజు ముందు ఈ పరిణామం జరగటం విశేషం. బౌబజార్ పోలీసు స్టేషన్లో దాఖలైన పాత ఫిర్యాదు మేరకు దాదాపు 30 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలకు, సంధ్యకు మధ్య తరచుగా లావాదేవీలు జరిగాయని అధికారులు తెలిపారు. తమ కుటుంబీకులకు ఆ సంస్థలతో సంబంధాలు లేవని నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ వివాదంపై 30 అక్టోబర్ 2018 నాడే పత్రిక ప్రకటన ఇచ్చానని ఆయన అన్నారు. ఈ సంస్థల యజమానులను శనివారం నాడు కోల్కతా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.