తెదేపాలోకి శిల్పా సోదరుడు - KE. KRUSHNA MURTHY
కర్నూలు జిల్లా బేతంచర్ల వైకాపా నాయకుడు శిల్పా రాజగోపాల్ రెడ్డి తెదేపాలో చేరారు. సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధికి ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు ఆయన తెలిపారు.

తెదేపాలోకి శిల్పా రాజగోపాల్రెడ్డి
తెదేపాలోకి శిల్పా రాజగోపాల్ కుటుంబం
ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి సమక్షంలో వైకాపా నేత శిల్పా రాజగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల వైకాపా నాయకుడు, మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డికి ఈయన సోదరుడు. కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కండువా కప్పి రాజగోపాల్ రెడ్డినిపార్టీలోకి ఆహ్వనించారు.