రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు సందడి చేశారు. చాలా రోజుల తరువాత తమ స్నేహితులను కలుసుకున్న ఆనందంలో విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకున్నారు. పలు పాఠశాలల్లో మాత్రం సమస్యలే స్వాగతం పలికాయి.
వేసవి సెలవులకు తెరపడింది.రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.పాఠశాలల వద్ద సందడి నెలకొంది.ఎండల తీవ్ర ఇంకా ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోఈనెల15వరకు ఒంటిపూటే తరగతులు నిర్వహించనున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈసారివిద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ హోర్డింగులు ఏర్పాటు చేశారు.కొన్ని సర్కారు బడుల్లో సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి.పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,ఏకరూప దుస్తులు ఉచితంగా అందిస్తున్నా...భవనాల కొరత తీవ్రంగా ఉంది.చాలా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదుల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది.కడప జిల్లాలోని582ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీగోడ లేదు. 706తరగతి గదులు శిథిలావస్థకు చేరినవే ఉన్నాయి. 105పాఠశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.