ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా పలు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నికల్లో గెలవలేక మోదీ, కేసీఆర్‌లతో చేతులు కలిపిన వైకాపా దాడులకు దిగిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 130 పైనే అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయ నాయకుల పని పడతామన్నారు.
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు: కోడెల - kodela
సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, ఆరాచకానికి మధ్య జరిగిన ఎన్నికలని సభాపతి కోడెల అభివర్ణించారు. తెదేపాను ఓడించేందుకు భాజపా, వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల కమీషన్‌తో కుమ్మక్కై ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. వారు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా..ప్రజలు తమకు ఓట్లు వేశారని తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సభాపతి కోడెల శివప్రసాద్