రాష్ట్రంలో పనిచేస్తున్న సర్వ శిక్షా అభియాన్ ఉపాధ్యాయులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద టీచర్లు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర విభజనానంతరం తమను జీవో నెం 39 ప్రకారం ప్రత్యేక కేటగిరి కింద గుర్తించినా... ఇప్పటి వరకు క్రమబద్దీకరించలేదని వాపోయారు. గడిచిన 18 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి' - sarva shiksha abhayan teachers
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద సర్వ శిక్షా అభియాన్ ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
'పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి'