ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కంచెల మునేరులో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు - కంచెల మునేరు

కంచెల మునేరు నుంచి ఇసుక తోలుతున్న బిల్డర్స్​ అసోసియేషన్ ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వుకోడానికి గ్రామస్థులకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఇతరులు తోలుకోడానికి అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

కంచెల మునేరులో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు

By

Published : Jun 17, 2019, 6:07 PM IST

కంచెల మునేరులో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్థులు
కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచెల మునేరు వద్ద ఇసుక ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామం నుంచి ఇసుకను తరలిస్తోన్న...బిల్డర్స్ అసోసియేషన్ ట్రాక్టర్లను గ్రామస్థులు నిలిపివేశారు. కలెక్టర్ అనుమతిలో ఇసుక తరలిస్తున్నామని.. అయినా గ్రామస్థులు అడ్డుకున్నారని బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ పనుల కోసం ఇసుక తరలిస్తున్నామని వారు తెలిపారు. ఇసుక తవ్వుకోవడానికి తమకు అవకాశం ఇవ్వటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అవకాశం ఇస్తేనే ఇతరులను తవ్వుకోనిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details