తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచుకునేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే... తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతోంది. వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కోనసీమ తిరుపతికి పోటెత్తిన భక్తులు - atreyapuram
కోనసీమ తిరుపతిగా పేరుగాంచింది తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం. ఇక్కడున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాలు నోము నోచుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి.
కోనసీమ తిరుపతిలో నోము నోచేందుకు పోటెత్తిన భక్తుల