విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లోని తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చినమేరంగి నుంచి తోటపల్లి బైక్పై వస్తోన్న వారిని ఎదురుగా వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తోటపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్, హరీష్, ఆర్.లోకేశ్ గాయపడ్డారు. క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై గరుగుబిల్లి మండల పోలీసులు విచారణ చేపట్టారు.
పార్వతీపురంలో రోడ్డు ప్రమాదం... ముగ్గురికి తీవ్రగాయాలు - accident
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లోని తోటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ - వ్యాను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పార్వతీపురంలో రోడ్డు ప్రమాదం