చిత్తూరు జిల్లాలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్..! - చిత్తూరు
మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈసీకి సిఫార్సు చేశారు. గత నెలలో జరిగిన పోలింగ్ వీడియో దృశ్యాలను పరిశీలించిన అనంతరం సూచన చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

చిత్తూరు జిల్లాలోని మరో 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టాలని కలెక్టర్.. ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. మూడు జిల్లాల్లోని 7 నియోజకవర్గాల పరిధిలోని 18 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసింది. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ వ్యవహారం తలెత్తింది. గత నెలలో జరిగిన పోలింగ్‌ను వీడియోలను పరిశీలించిన డీఈవో.. కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. జిల్లాలోని 310, 323 కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టాలని కలెక్టర్ కోరారు. రీపోలింగ్ సిఫార్సులపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సీఈవో కార్యాలయం తెలిపింది.