కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ రెండోరోజు విచారణకు షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. శారదా కుంభకోణంపై ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణను సీబీఐ రికార్డ్ చేయడం లేదు.
కేసు విచారణలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కునాల్ ఘోష్ ఉదయమే షిల్లాంగ్ కార్యాలయానికి వచ్చారు. ఆయననూ ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు.