ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తీపి జ్ఞాపకాలతో మరుజన్మ వరకు వేచి ఉండండి - LOVERS DAY

ప్రేమ విఫలమైతే ప్రేమికులు పడే బాధ వర్ణనాతీతం. అలా జరగితే ఏం చేయాలో చదివేయండి.

ప్రేమవిఫలం

By

Published : Feb 14, 2019, 9:48 PM IST

ప్రేమ అనే రెండు అక్షరాలు... మనిషిలో ఎంతో అలజడిని సృష్టిస్తాయి. ప్రేమ వెలకట్టలేని నవ్వును, సంతోషాలను తెప్పిస్తుంది. విఫలమైతే అంతులేని విషాదాన్ని పంచుతుంది. ప్రేమ బంధానికి గాయమైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో మాటల్లో చెప్పలేం. ఆ ప్రియుడో ప్రియురాలో పడే వేదన వర్ణణాతీతం.

ఆ విరహ వేదనను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాలెన్నో. లైలా-మజ్ను, దేవదాసు-పార్వతీ కథలు సజీవమై నేటికి మన కళ్లముందు దర్శనమిస్తాయి. దానికి కారణం ప్రేమకున్న బలం. అందుకే సినిమాలోవి కల్పిత పాత్రలు అని తెలిసినా నిజమనే అనుకుంటుంటాం. ఓడిపోయిన వారి గాథలూ మనచుట్టూనే ఉంటాయి.

ఈ కథలకు ఒక గొప్పతనం ఉంది. ఈ రెండూ కూడా విఫలమైన ప్రేమ కథలే. కారణాలేవైనా ఆ కథల్లోని ప్రేమికులు జీవితంలో ఒకటి కాలేకపోయారు. అయినా సరే ప్రేమ అనగానే అందరికీ ఆ రెండు కథలే గుర్తుకు వస్తాయి. అసలు ఆ కథల్లో ప్రేమ విఫలమైంది కాబట్టే అవి అంత గొప్ప కావ్యాలుగా ప్రజల గుండెల్లో నిలిచి పోయాయి అనేది కొందరు విమర్శకులు అంటుంటారు.

ప్రేమ విఫలం అంటే... ?

ప్రేమవిఫలం

ప్రేమ అనే బంధంతో జీవితాంతం కలిసి ఉండిపోవాలని కలలుగన్న ప్రేమికులు...ఎప్పటికీ కలిసి జీవించలేము అన్న పరిస్థితి తలెత్తితే దాన్నే ప్రేమ విఫలమైనట్టు. ప్రేమ అనేది విఫలమైతేనే అది చరిత్రగా నిలుస్తుంది. లేదంటే అది పెళ్లితో ముగిసి అందరిలా సాధారణ జీవితంగా మారిపోతుంది అనేది కొందరు చెప్తుంటారు.

దేవదాసు ఒక ఉదాహరణ...

పార్వతికి పెళ్లై వెళ్లిపోతే తన ప్రేమ విఫలమైందంటూ దేవదాసు మందు గ్లాసు పట్టుకొని...ఎంతలా కృశించిపోతాడో సినిమాలో చూశాం. అది సినిమా అని తెలిసినా సరే మన మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. కానీ ఇదే పరిస్థితి నిజ జీవితంలో సంభవిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.

భేరీజు వేసుకో...

ప్రేమ విఫలమవడానికి కారణాలను భేరీజు వేసుకోవాలి. అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది ఆలోచించాలి. ఎవరి పాత్ర ఉందనే విషయాలను మనసులో చర్చించుకోండి. ఈ సమయంలో గతించిపోయిన జ్ఞాపకాలను తవ్వుకోకుండా...మీ ప్రేమలో ఆనంద క్షణాలను మాత్రమే గుర్తుకు తెచ్చుకోండి.

ప్రేమ విఫలమైంది అని భావించి బాధపడేకన్నా... మీ ప్రేమలో ఓ జన్మపాటు ఎడబాటు ఎదురైంది అని భావించండి. మరో జన్మలో అయినా మీ ప్రేమ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ప్రేమ ఎప్పటికీ ఓటమి చెందదు.
మధురమే...

మీ ప్రేమ జ్ఞాపకాల్ని మీ మనసు పొరల్లో దాచుకోండి. ఆ ఆనంద క్షణాలను పెట్టుబడిగా పెట్టి జీవితాన్ని కొనసాగించండి. ఎందుకంటే మీరు నిజంగా ప్రేమించారు. ఎంతలా అంటే ఒకర్ని ఒకరు విడిచిపోకూడదు అని బలంగా నమ్మేంతగా...కానీ విధి వంచించిందో, మీ ప్రేమను కాపాడుకోవడం మీ శక్తికి మించిన పనైందో కానీ మీ ప్రేమ విఫలమైంది. దానకి మీరు బాధ్యులు కాదు. అంటే మీ ప్రేమ నిజంగా విఫలం కాలేదు. కాకపోతే ఈ జన్మకు మీ ప్రేయసి లేదా మీ ప్రియుడ్ని మీరు మరోసారి కలవలేరు అంతే... అంతకు మించి ఏం కాలేదు.

చింతించకుండా ఆ ప్రేమతో జీవితాన్ని కొనసాగిస్తే ఎన్నో విజయాలు సాధించి మీ ప్రేమకు అంకితమివొచ్చు.
వచ్చే జన్మలో మీ సొంతం కావచ్చు...

జరిగినదానికి చింతిస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీకు ప్రేమపై గౌరవం లేనట్టే. ఎందుకంటే ప్రేమికులు నాశనం కావాలని ప్రేమ ఎప్పుడు కోరుకోదు. ఈ జన్మలో ఎడబాటు ఎదురైంది అని భావించండి. వచ్చే జన్మలో మీ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఆ జ్ఞాపకాలను హృదయాంతరాలలో పదిలపరుచుకుని అలా బతికేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details