వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు - remand_extention
వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. నిందితుల విజ్ఞప్తిని అంగీకరిస్తూ పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![వివేకా హత్యకేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3333554-thumbnail-3x2-viveka.jpg)
viveka
వివేక హత్యకేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు జూన్ 3 వరకూ మరోసారి రిమాండ్ పొడిగిస్తూ పులివెందుల కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. తమను కడప నుంచి పులివెందుల సబ్‌జైలుకు తరలించాలని వీరు ముగ్గురూ పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయస్థానం.... పులివెందుల సబ్‌జైలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
TAGGED:
remand_extention