లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఆర్టీసీ కడప జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబే అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలో...అవినేతి కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 31 కేసులు ఉన్న జగన్ను సీఎంగా ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కడపలో మాట్లాడిన సుబ్బారెడ్డి ...మోదీ, కేసీఆర్, జగన్, ఈసీలు ఏకమై విశ్వప్రయత్నం చేసిన చంద్రబాబు తిరిగి సీఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు.
'31 కేసులున్న వ్యక్తి సీఎం ఎలా అవుతారు' - rtc zonal chairman
అభివృద్ధి ముఖ్యమంత్రి కావాలో... అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే వ్యక్తి సీఎంగా కావాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్టీసీ కడప జోనల్ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
ఆర్టీసీ కడప జోనల్ ఛైర్మన్ రెడ్యం సుబ్బారెడ్డి