ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'విశ్రాంతి' సూచనపై రాయపాటి అసంతృప్తి! - GUNTUR MP

తమతో వైకాపా నేతలు సంప్రదిస్తున్న మాట వాస్తమేనని ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు స్పష్టం చేశారు. విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారని చెప్పారు. ఈ పరిణామంతో రాయపాటి సాంబశివరావు అసంతృప్తి చెందారని అన్నారు.

ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు

By

Published : Mar 14, 2019, 4:23 PM IST

Updated : Mar 14, 2019, 5:02 PM IST

ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు
తమతో వైకాపా నేతలు సంప్రదిస్తున్న మాట వాస్తవమేనని లోక్​సభ సభ్యుడురాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు స్పష్టం చేశారు. తన తండ్రిని విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారన్నారు. ఈ పరిణామంతో ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తి చెందారని చెప్పారు. ఐదేళ్లలో పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులతోపాటు.. వంద కోట్ల రూపాయల మేరకు సీఎస్ఆర్ నిధుల్ని తీసుకువచ్చామని తెలిపారు. ఈ వయసులోనూ కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదనే అసంతృప్తి సాంబశివరావులోఉందన్నారు. వైకాపా నాయకులు తమతో మాట్లాడారని... కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రంగారావు చెప్పారు.
Last Updated : Mar 14, 2019, 5:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details