నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో హామీ రాకపోవడంపై ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తితో ఉన్నారు. నరసరావుపేట టికెట్ విషయంలో తనకంటే సమర్థులు ఎవరున్నారని ప్రశ్నించారు. తనకన్నా సమర్థులు ఉంటే టికెట్ ఇవ్వొచ్చని చెప్పారు. టికెట్ తనకిస్తే మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైకాపా నేతలు తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. టికెట్ ఇవ్వకుంటే సాయంత్రం భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తానన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చిన రాయపాటి...ముఖ్యమంత్రిపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుపై భరోసా ఇవ్వకుండా ఆలోచిస్తామన్నారు. సత్తెనపల్లి టిక్కెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశానని... కోడెలకు ఇస్తామని అధినాయకత్వం చెప్పగా అంగీకరించినట్టు వెల్లడించారు.
రాయపాటికి మంత్రి ఫోన్
అలక సంగతి తెలుసుకున్నమంత్రులులోకేశ్,ప్రత్తిపాటి పుల్లారావు..రాయపాటికి ఫోన్ చేశారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.