శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం లోక బాంధవుడిగా జన్మించిన జగదభిరాముని జన్మదినంను ప్రజలు పండుగగా జరుపుకుంటారు. ఇదే రోజు సీతారాముల కల్యాణం కూడా జరుగుతుంది.
ఆ రోజే ఎందుకు...?
సీతారాముల కల్యాణం కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. రాముని జన్మదినం, కల్యాణం ఒకేరోజు ఈ వేడుకలు జరగడం వల్ల.. చైత్రశుద్ధ నవమి హిందువులకు అంత ప్రియంగా మారింది. కల్యాణ మహోత్సవం కూడా ఆయన జన్మ సమయమైన మధ్యాహ్నం 12 గంటలకే జరిపిస్తారు.