ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నేడూ సీబీఐ ముందుకు రాజీవ్‌ - సుప్రీంకోర్టు

కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్​కుమార్.. వరుసగా ఐదోరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు.

రాజీవ్​పై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సీబీఐ

By

Published : Feb 13, 2019, 6:27 AM IST

Updated : Feb 13, 2019, 10:11 AM IST

రాజీవ్​పై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సీబీఐ
శారదా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్​కతా పోలీస్​ కమిషనర్​ రాజీవ్​కుమార్​పై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు.. నేడూ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

నాలుగో రోజు 11 గంటలు

శారదా కుంభకోణానికి సంబంధించి సాక్ష్యాధారాలు మాయమయ్యాయన్న ఆరోపణలపై రాజీవ్​కుమార్​పై ప్రశ్నలు సంధిస్తోంది సీబీఐ. నాలుగో రోజు షిల్లాంగ్​లోని సీబీఐ కార్యాలయంలో సుమారు 11 గంటల పాటు రాజీవ్​ను ప్రశ్నించింది.

రాజీవ్​తో పాటు తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ కునాల్​ ఘోష్​ ఫిబ్రవరి 10,11న విచారణ ఎదుర్కొన్నారు. శారదా కుంభకోణం కేసులో 2013లో అరెస్టయ్యారు కునాల్​. 2016లో బెయిల్​పై బయటికొచ్చారు.

ఫిబ్రవరి 3న రాజీవ్​కుమార్​ను ప్రశ్నించటానికి ఆయన నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులను కోల్​కతా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఘటన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది సీబీఐ. విచారణకు సహకరించాల్సిందిగా రాజీవ్​ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. అతణ్ని అరెస్టు చేయొద్దని సీబీఐకి సూచించింది.

Last Updated : Feb 13, 2019, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details