'నిర్భయంగా, నిష్పక్షపాతంగా...ఓటు వేయ్యండి' - rally
ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయవాడలో జరిగిన అవగాహన ర్యాలీలో ప్రముఖ క్రీడాకారిణి పీసీ సింధు పాల్గొన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వినియోగించుకోవాలని కోరారు.
ఓటు హక్కు వినియోగంపై ప్రముఖ బ్యాట్మెంటెన్ క్రీడాకారిణి పీవీ సింధు విజయవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ అవగాహన ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమరావు హాజరయ్యారు. యువతీయువకులు అవగాహన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని ఓటు విలువపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ పాల్గొన్న పీసీ సింధుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.