ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తితిదేకు పుట్టా రాజీనామా.. కొత్త ఛైర్మన్​గా వైవీ! - putta sudhakar yadav

తితిదే చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేస్తారు. తదుపరి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఈ శనివారమే నియమితులు అవుతారని తెలుస్తోంది.

ttd

By

Published : Jun 19, 2019, 5:11 PM IST

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్​ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తితిదే ఈవో సింఘాల్​కు అందజేశారు. తదుపరి ఛైర్మన్​గా వైకాపా సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులు కానున్నారని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వైవీ అభ్యర్థిత్వం ఖరారైందని.. రానున్న శనివారమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది.

ముందు ఒప్పుకోకపోయినా...

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. తితిదే పాలకమండలిని రద్దు చేస్తారని చాలామంది భావించారు. ఇదే సమయంలో.. ఛైర్మన్​గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్​తో పాటు.. పాలకమండలి సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ముందుకురాలేదు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునేవరకూ వేచిచూస్తామని చెప్పుకొచ్చారు. చివరికి.. తితిదే చైర్మన్​గా పుట్టా రాజీనామా చేశారు.

ABOUT THE AUTHOR

...view details