ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రపంచకప్​కు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరు? - indian cricket team

ప్రపంచకప్​కు వెళ్లే భారత జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్, స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్​గా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై సెలక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు.

లెఫ్ట్ ఆర్మ్ పేసర్, స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్

By

Published : Feb 14, 2019, 5:42 PM IST

ప్రపంచకప్​కు మరెంతో సమయం లేదు.​ ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే ఆస్ట్రేలియా సిరీసే వరల్డ్ కప్ ముందు భారత్​ ఆడే చివరి సిరీస్​. మే 30 నుంచి ఇంగ్లాండ్​లో మెగా టోర్నీ జరగనుంది. అక్కడికి వెళ్లే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరా అనేది ఇప్పుడు ప్రశ్న. ఖలీల్ అహ్మద్.. జయదేవ్ ఉనాద్కట్ పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి.

కంగారులతో రెండు టీ-ట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్​తో స్పెషలిస్ట్ బ్యాట్స్​మెన్ కమ్ రెండో వికెట్ కీపర్​గా దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్​లలో ఎవరు వెళ్తారా అనేది తేలనుంది.

భారత్​- ఏ మ్యాచ్​ల్లో అదరగొట్టిన రాహుల్.. చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపికయ్యాడు.

సెలక్టర్లు ఇప్పటికే ప్రపంచకప్​కు వెళ్లే 13 మందిని గుర్తించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, విజయ శంకర్, చాహల్, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, షమి ఈ జాబితాలో ఉన్నారు.

మిడిలార్డర్​లో రెండు స్థానాల కోసం నలుగురు బ్యాట్స్​మెన్ పోటీలో ఉన్నారు. బుమ్రా, షమి, భువనేశ్వర్ పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. వీరితో పాటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్​ ఎవరనేది ప్రశ్న.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఖలీల్.. వరల్డ్ కప్​కు వెళ్లేలా కనపడుతున్నాడు.

ఈ మధ్య జరిగిన రంజీ సీజన్​లో సౌరాష్ట్రను ఫైనల్​కు తీసుకెళ్లిన ఉనాద్కట్​ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. పేస్ బౌలింగ్​లో వివిధ వేరియేషన్స్ చూపిస్తూ సెలక్టర్లను ఆకట్టుకుంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details