ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళన - west godavari

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు.

ఏలూరు కలెక్టరేట్​ వద్ద గిరిజనుల ధర్నా

By

Published : Jul 1, 2019, 10:20 PM IST

ఏలూరు కలెక్టరేట్​ వద్ద గిరిజనుల ధర్నా

ఏలూరు నగరంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకూ ఏపీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మండలమైన టి.నరసాపురం, పోలవరం, జరుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తాతల కాలం నుంచి ఆదివాసీలు పోడు భూములు సాగు చేస్తున్నారు. భూములకు పట్టాలు ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు స్పందిచటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details