విశాఖ మన్యంలో జరిగిన విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వంట చెరకు కోసం అడవికెళ్లిన బృందం.. దాహంతో జీలుగుకల్లు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు చిన్నారులు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన చిన్న బుల్లెమ్మ(50), భగవతి(10) మృతదేహాలతో జీలుగు చెట్టు యజమాని ఇంటివద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. ఎవరూ కల్లు తాగొద్దని పురుగుల మందు కలిపారని వారు ఆరోపిస్తున్నారు. కల్లు ఇద్దరి ప్రాణాలు బలిగొన్నా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
విశాఖ మన్యంలో ఇద్దరి ప్రాణాలు తీసిన జీలుగు కల్లు - ap latest
విషపూరితమైన జీలుగు కల్లు తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన విశాఖ మన్యం చిట్రకాయిపుట్టులో జరిగింది. వారి మరణానికి కారణం ఆ చెట్టు యజమానే అని బంధువులు ఆందోళనకు దిగారు. కల్లులో పురుగుల మందు కలపడం వల్లే మృతి చెందారని ఆరోపిస్తున్నారు.
వంట చెరుకు కోసం వెళ్లి..జీలుగు కల్లు తాగి